Who is eligible for TSPSC Group 4 jobs? What is the syllabus?

TSPSC గ్రూప్​–4 ఉద్యోగాలకు ఎవరు అర్హులు.. సిలబస్​ ఏంటి? ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. 


తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ​ ఆయా శాఖల అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో ఇప్పటి వరకు మొత్తం 9,168 ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్టు సమాచారం. 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 95శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా గ్రూప్​–4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్​ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్​పీఎస్సీకి అందించాలని సీఎస్​ ఆదేశించారు. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా నోటిఫికేషన్​లో చేర్చాలని చెప్పారు.

శాఖలు–ఖాళీలు 

రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో…

–జూనియస్టెనోగ్రాఫర్​

–టైపిస్ట్​

–జూనియర్​ అసిస్టెంట్​


పంచాయతీ రాజ్​ డిపార్ట్​మెంట్​లో..

–జూనియర్​ అసిస్టెంట్​

–టైపిస్ట్​


కమర్షియల్​ టాక్స్​ డిపార్ట్​మెంట్​లో..

–జూనియర్​ అసిస్టెంట్​


హోమ్​డిపార్ట్​మెంట్​లో..

–జూనియర్​ అసిస్టెంట్​

–జూనియర్​ స్టెనో..

–టైపిస్ట్​


ఐ అడ్​ కాడ్​లో..

–జూనియర్​ అసిస్టెంట్​

–జూనియర్​ స్టెనోగ్రాఫర్​


డిజార్డర్​ రెస్పాన్స్​ అండ్​ ఫైర్​సర్వీసెస్​లో..

–జూనియర్​ స్టెనోగ్రాఫర్​

–టైపిస్ట్​


తెలంగాణ వైద్యవిధాన పరిషత్​లో..

–జూనియర్​ అసిస్టెంట్​


డెరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​

–జూనియర్​ అసిస్టెంట్​


ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​లో..

–జూనియర్​ అసిస్టెంట్​..

-జూనియర్​ స్టెనోగ్రాఫర్ అండ్​ టైపిస్ట్​​

అర్హతలుఈ పోస్టులకు ఏదేని డిగ్రీ సర్టిఫికేట్​తో పాటు గవర్నమెంట్​ టెక్నికల్​ ఎగ్జామినేషన్​ ఇన్​ టైప్​ రైటింగ్​లో సంబంధిత లాంగ్వేజ్​లో హయ్యర్​ గ్రేడ్​ సర్టిఫికేట్​ కలిగి ఉండాలి. లేదా ఒకవేళ తెలుగు టైప్​ రైటర్​ అయితే గవర్నమెంట్​ స్టాండర్డ్​ కీబోర్డులో టైప్​ రైటర్​ ఎగ్జామ్​ పాసై ఉండాలి.


జూనియర్​ అసిస్టెంట్​

ఈ పోస్టులకు అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉంటే చాలు. ఎలాంటి ఇతర సర్టిఫికేట్​లు అవసరం లేదు.


వయసు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు..


ఎగ్జామ్​ ప్యాటర్న్​

గ్రూప్​ –4 ఎగ్జామ్​లో పదోతరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లుంటాయి. మొదటిపేపర్​ 150 మార్కులకు జనరల్​ నాలెడ్జ్​ సంబంధించి ప్రశ్నలుంటాయి. రెండో పేపర్ 150 మార్కులకు సెక్రటేరియల్​ ఎబిలిటిస్​ సంబంధించి ప్రశ్నలుంటాయి. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. ప్రతి ప్రశ్నలకు ఒక నిమిషం చొప్పున ప్రతి పేపర్​కు 150 నిమిషాల సమయం ఉంటుంది. మల్లిపుల్​ చాయిస్​ ప్రశ్నలే ఉంటాయి.


పేపర్​–1 జనరల్​ నాలెడ్జ్​ సిలబస్

- కరెంట్​ అఫైర్స్​

- ఇంటర్నేషనల్​ రిలేషన్స్​ అండ్​ ఈవెంట్స్​

- నిత్యజీవితంలో జనరల్​ సైన్స్​

- పర్యావరణ అంశాలు–విపత్తు నిర్వహణ

- భారతదేశ, తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక స్థితి గతులు. ఆర్థిక వ్యవస్థ

- భారత రాజ్యాంగం–ముఖ్యలక్షణాలు

- భారత ప్రభుత్వ రాజకీయ వ్యవస్థ

- ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోధ్యమం

- తెలంగాణ చరిత్ర, ఉద్యమం

- తెలంగాణ సంస్కృతి, కళలు, వారసత్వ సంపద

- తెలంగాణ రాజకీయాలు


పేపర్​–2 సెక్రెటేరియల్​ ఎబిలిటీస్

- మెంటల్​ ఎబిలిటీ

- కాంప్రహెన్షన్​

- లాజికల్​ రీజనింగ్​

- రీ అరెంజ్​మెంట్​ ఆఫ్​ సెంటెన్సెస్​ విత్​ వ్యూ టూ ఇంప్రూవింగ్​ ఆఫ్​ ఏ ప్యాసేజ్​

- న్యూమరికల్​ అండ్​ అర్థమెటిక్ ఎబిలిటీస్​


రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫ్రొఫిషియన్సీ ఇన్​ ఆఫీస్​ ఆటోమేషన్​ విత్​ యూసేజ్​ ఆఫ్​ కంప్యూటర్స్​ అండ్​ అసోసియేట్​ సాఫ్ట్​వేర్స్​’ టెక్నికల్​ విభాగంపై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 50 మార్కులకు ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 15మార్కులు, బీసీలకు 17.5మార్కులు, జనరల్​ అభ్యర్థులు 20 తప్పనిసరిగా సాధిస్తే అర్హతగా పరిగణిస్తారు.


50 మార్కుల పరీక్షలో మొత్తం నాలుగు పార్టులుంటాయి. పార్ట్​ ఏలో ఎంఎస్​ వర్డ్​లో లెటర్​ టైపింగ్​(20 మార్కులు) , పార్ట్​ బిలో ఎంఎస్​ ఎక్సేల్​లో టేబుల్​ ప్రిపరేషన్(15 మార్కులు)​, పార్ట్​ సిలో ఎంఎస్​ పవర్​ పాయింట్​లో స్లైడ్స్​ మేకింగ్​(10 మార్కులు), పార్ట్​ డిలో ఈమెయిల్​ రైటింగ్(05 మార్కులు)​ ఉంటాయి.