10,493 పోస్టులతో ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేయనుంది. సుమారు 10,493 ఖాళీల్లో నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఆఫీసర్ స్కేల్-1 (పీఓ), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-2, 3 (ఆర్‌ఆర్‌బీ ఎక్స్) పోస్టులు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 43 ప్రాంతీయ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 10,493 (సుమారుగా)
ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) 5076, ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) 4206, ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్, ఐటీ ఆఫీసర్, సీఏ) 1060, ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 156 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. స్థానిక భాష తప్పనిసరిగా మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. అదేవిధంగా పోస్టును బట్టి డిగ్రీలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చురల్ మార్కెటింగ్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ అస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 40 మధ్య ఉండాలి (పోస్టును బట్టి వేర్వేరుగా ఉన్నాయి).
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. క్లర్క్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు మాత్రమే ఉంటాయి. పీఓ పోస్టుకు మాత్రం ఈ రెండింటితోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కాగా, ఆఫీసర్ స్కేల్-2, 3 పోస్టులకు ఒకే పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
పరీక్ష ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
APPLICATIONS LINK GIVEN BELOW
Apply Online for IBPS RRB-X Officer Scale-I (PO)
Apply Online for IBPS RRB-X Office Assistant (Clerk)
Apply Online for IBPS RRB-X Officer Scale-II and III
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 8
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
అడ్మిట్ కార్డు: జూలై లేదా ఆగస్టులో
ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఆగస్టు 1 నుంచి 21 మధ్య
ఫలితాలు: సెప్టెంబర్‌లో
స్కేల్ 2, 3 రాతపరీక్ష: సెప్టెంబర్ 25
పీఓ మెయిన్స్ ఎగ్జామ్: సెప్టెంబర్ 25
క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్ 3
ఆఫీసర్ స్కేల్-2, 3 ఇంటర్వ్యూ: అక్టోబర్ లేదా నవంబర్‌లో
వెబ్‌సైట్: www.ibps.in