SBI CBO Notification 2021: ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
SBI Circle Based Officer Jobs: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా1226 (రెగ్యులర్-1100, బ్యాక్‌లాగ్-126) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CIRCLE BASED OFFICER) పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ అఫిషియల్ వెబ్‌సైట్ https://sbi.co.in/ లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1226 CIRCLE BASED OFFICER
పోస్టు పేరు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 2021 డిసెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 9, 2021
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 29, 2021
ఆన్‌లైన్ పరీక్ష: జనవరి 2022