After Intermediate available Courses and Answers to doubts in the minds of students

ఇంటర్మీడియేట్​ తర్వాత విద్యార్థుల పయనమెటువైపు? అందుబాటులో ఉన్న కోర్సులు ఏవి? ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఏ కోర్సులో చేరాలి? తొందరగా ఉపాధి మార్గాలు లభించాలంటే ఎటువైపు అడుగులు వేయాలి? కొత్త కోర్సులు ఏవైనా వచ్చాయా? ఇంటిగ్రేటెడ్​ కోర్సుల ఉపయోగమేంటి? ఇలా విద్యార్థుల మదిలో ఉన్న సందేహాలకు సమాధానాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం?

ఇంటర్​ తర్వాత.. ఎంట్రీ ఎటువైపు

ఇంటర్మీడియేట్​ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, సర్టిఫికెట్, ఇంటిగ్రేటెడ్​, కరెస్పాండెన్స్ వంటి సాంప్రదాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎంసెట్, నీట్, జేఈఈ, క్లాట్, జీప్యాట్, నాటా, ఎస్సీఆర్ఏ, నిఫ్ట్, ఎన్ఐడీ, ఎఫ్డీడీఐ, ఐఐఎస్ఈఆర్​ వంటి వందల రకాల ప్రవేశ పరీక్షలు రాసేందుకు అర్హత ఉంటుంది. ఇంటర్మీడియేట్​ అర్హతతో ఉద్యోగాలు సాధించాలనుకునే వారు రక్షణ రంగం, బ్యాంకింగ్, ఎస్సెస్సీ, యూపీఎస్సీ, రైల్వే, పోస్టల్, పోలీస్, గ్రూప్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, వీఆర్వో, వీఆర్ఏ, వంటి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు అనుగుణంగా ప్రిపేరేషన్​ కొనసాగించవచ్చు.

After Intermediate available Courses and Answers to doubts in the minds of students

డిగ్రీలో చేరాలనుకునేవారు….

ఇంటర్మీడియేట్​లో ఎంపీసీ, బైపీసీ చదివిన స్టూడెంట్స్​ బీజడ్​సీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, ఫారెస్ట్రీ, అప్లయిడ్ న్యూట్రిషన్, కంప్యూటర్ అప్లికేషన్, క్లినికల్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, బయోఫిజిక్స్, మెరైన్లివింగ్రీసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ సెన్సైస్, ఫోరెన్సిక్ సైన్స్ → ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ కోర్సుల్లో చేరవచ్చు.

మ్యాథ్స్ స్టూడెంట్స్​ ఎంపీసీ, ఎంపీసీస్, ఎంపీఈ, ఎంఎస్సీఎస్, ఎంఈసీఎస్, బీఎస్సీ(ఎన్ఎస్), బీసీఏ ఎంఎస్సీ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఫైర్ఇంజినీరిగ్, ఫైర్అండ్​ సెఫ్టీ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరవచ్చు..


ఆర్ట్స్ స్టూడెంట్స్​ కోసం..

బీఏ, బీఎఫ్ఏ అప్లయిడ్ఆర్ట్స్, బీఎఫ్ఏ పెయింటింగ్, బీఏ లాంగ్వేజస్, బీఏ వొకేషనల్, బీఎస్డబ్ల్యూ, అరబిక్, ఇంగ్లిష్, ఫారెన్లాంగ్వేజస్, హిందీ, ఇస్లామిక్స్టడీస్, కన్నడ, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ఆర్ట్స్, తెలుగు, తమిళ్, ఉర్దూ, బీఏ వొకేషనల్ కమ్యూనికేషన్అండ్జర్నలిజం, కంప్యూటర్అప్లికేషన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, లైబ్రరీ అండ్ఇన్ఫర్మేషన్సైన్స్, పొలిటికల్సైన్స్, పబ్లిక్అడ్మినిస్ర్టేషన్, సైకాలజీ, సోషియాలజీ → ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంసీజే, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంపీహెచ్, పీజీ డిప్లొమా, జూనియర్డిప్లొమా, సీనియర్, అడ్వాన్స్​డ్​ డిప్లొమా.. బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీకాం ఫారెన్​ ట్రేడ్, బీకాం ట్యాక్స్, బీకాం వొకేషనల్, బీకాం హానర్స్ → ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఐపీసీసీ, సీఏ, సీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, సీఎస్, సీఎంఏ, మేనేజ్మెంట్ కోర్సుల్లో బీబీఏ, బీబీఎం, బీహెచ్ఎం, బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్హోటల్అడ్మినిస్ర్టేషన్, బీబీఏ టూరిజం అండ్హాస్పిటాలిటీ → ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎంహెచ్ఎం ఉన్నాయి..


అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల్లో చేరాలనుకునేవారు…

బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ బీఎస్సీ (ఆనర్స్) హోంసైన్స్, బీఎస్సీ (హానర్స్) ఫుడ్సైన్స్ అండ్న్యూట్రిషన్, బీవీఎస్సీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎస్సీ సీఏ బీఎం, బీఎస్సీ ఫిషరీస్, అగ్రికల్చర్పాలిటెక్నిక్, బీఎస్సీ సెరీకల్చర్, సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, సాయిల్ సైన్స్, బీఎస్సీ ఆక్వాకల్చర్, బీఎస్సీ ఫుడ్సైన్స్, బీఎస్సీ ఫుడ్అండ్న్యూట్రిషన్, బ్యాచిలర్ఆఫ్వెటెరినరీ అండ్ఎనిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ & ఏహెచ్), ఫారెస్ర్టీ, ప్లాంట్పాథాలజీ, ఎన్విరాన్మెంటల్ఇంజినీరింగ్/సైన్స్ → ఎంఎస్సీ, ఎంఎఫ్ఎస్సీ, ఎంబీఎస్సీ, ఎంటెక్, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఇంజినీరింగ్/టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో…

బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లాన్, ఎంఈ, సీఈ, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, ఎంఈ, ఏఈ, సీఈ, ఐటీ, పీఈ/ఐపీఈ, ఎంఈ, ఈఐఈ, సీటీ, టీటీ, ఎఫ్పీటీ, బీటీ, బీహెచ్ఎమ్& సీటీ, బీసీటీ&సీఏ, ప్యాకేజింగ్, ప్రింటింగ్టెక్నాలజీ, మెకట్రానిక్స్, అటోమొబైల్, ఆయిల్అండ్పెట్రోలియం, ఈటీఎం, ఫైర్​సెఫ్టీ,

బీటెక్ అగ్రికల్చర్ఇంజినీరింగ్, ఫుడ్​సైన్స్​, ఫుడ్​ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయో మెడికల్ఇంజినీరింగ్, లెదర్​ టెక్నాలజీ, టెక్స్​టైల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ, బయో కెమికల్ ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఎస్, ఎంఎస్సీ, ఏడీఎఫ్ఎస్, పీజీడీహెచ్ఎస్ఈ, పీజీడీఎఫ్ఎస్ఈ కోర్సులు ఉన్నాయి.


మెడికల్/పారా మెడికల్ విభాగాల్లో..

ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, పిజియోథెరపీ, బీఎస్సీ ఎంఎల్టీ, శానిటరీ ఇన్స్పెక్టర్, ఎక్స్రే, రేడియోలజిస్ట్, ఆప్టోమెట్రీ, యోగా, న్యాచురోపతి– ఎంఎస్, ఎండీ, ఎండీఎస్, డీఎం, డీఎన్బీ, ఎంఎసీహెచ్, ఎంపీటీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ కోర్సులు చేయవచ్చు.ఫార్మసీ రంగంలో వెళ్లాలనుకునేవారు..డి.ఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మ్.డి → ఎంఫార్మసీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, డీఎం, ఎండీ కోర్సులు చేయవచ్చు.


డిప్లొమా కోర్సులు..

డిప్లొమా ఇన్​ ఫ్రెంచ్​, జర్మన్, రష్యన్, అరబిక్, పర్షియన్, డిప్లొమా ఇన్ ఎనిమల్​ హజ్బెండరీ, ఫిష్​ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, ఫిషరీ మేనేజ్మెంట్అండ్​ ఫిషరీ బ్రీడింగ్, నాటికల్​ సైన్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్సీడ్టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్​ ఫిల్మ్ అండ్​ టెలివిజన్, రేడియో, సినిమాటోగ్రఫీ, డిప్లొమా ఇన్​ క్యాడ్, రోబోటిక్స్, ఫ్యాబ్రికేషన్​ టెక్నాలజీ, వీఎల్ఎస్ఐ డిజైన్, వీహెచ్​డీఎల్ కోర్సులు ఉన్నాయి.


ఇంటిగ్రేటెడ్ కోర్సులు..

బీటెక్+ఎంటెక్, బీటెక్+ఎంబీఏ, బీఎస్+ఎంఎస్, ఐ.ఎంఎస్సీ, ఐ.ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ నానోటెక్నాలజీ, ఎంబీఏ (ఐబీ), బీఏ-ఎంఏ, బీఏ-ఎంబీఏ, బీఏ బీఈడీ, బీఎస్సీ–బీఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఏవియేషన్ డిగ్రీ కోర్సులు:

బీబీఏ (ఏవో), బీబీఏ (ఏహెచ్టీ), బీబీఏ(ఏ), పైలట్, ఎయిర్ హోస్టెస్, ఫ్లయిట్ స్టివార్డ్ ట్రైనింగ్, ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, డిప్లొమా ఇన్​ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, క్యాబిన్ క్రూ ట్రైనింగ్, డిప్లొమా ఇన్ ఎయిర్ హోస్టెస్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఆప్టెక్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్ గ్రౌండ్ స్టాఫ్ సర్వీసెస్, ఎయిర్ పోర్ట్ హ్యాండ్లింగ్ మేనేజ్మెంట్, కార్గో అండ్ కొరియర్ మేనేజ్మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ సర్వీసెస్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ టికెటింగ్, ఎయిర్ ఫేర్, ట్రావెల్ అండ్ టికెటింగ్, ఎయిర్ టికెటింగ్ అండ్ ట్రావెల్ కార్గో అండ్ కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్,ఎయిర్లైన్స్ అండ్ టికెటింగ్ కోర్సులున్నాయి.