Telangana ITI ADMISSIONS 2019

తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు, గురుకుల పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్‌ఐటీఐ)లు, ప్రభుత్వ, ్ర పయివేట్ మైనార్టీ ఐటీఐల్లో 2019-20కిగాను వివిధ ట్రేడుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

●కోర్సు పేరు: ఐటీఐ -విభాగాలు: ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ -నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 54 ప్రభుత్వ ఐటీఐలు, 215 ప్రయివేట్ ఐటీఐలు కలవు. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎస్‌సీవీటీ) అనుబంధగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఐటీఐలు ఉన్నాయి.
●కోర్సు వ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు) లేదా ఏడాది(రెండు సెమిస్టర్లు) లేదా ఆరు నెలలు (ఒక సెమిస్టర్ మాత్రమే) గమనిక: వివిధ ట్రేడ్‌లను బట్టి కోర్సు వ్యవధి మారుతూ ఉంటుంది. 
●అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఒఎస్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్‌ఎస్) నుంచి ఎస్‌ఎస్‌సి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. -ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా కొన్ని ట్రేడులలో ప్రవేశానికి అర్హులు. 
●వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. దరఖాస్తుదారులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. 
●కోర్సు ఫీజు: ట్యూషన్‌ఫీజు+ కామన్ మనీ డిపాజిట్‌లు కలిపి ప్రభుత్వ ఐటీఐలో రూ. 60/-, ప్రయివేట్ ఐటీఐలో: ఇంజినీరింగ్ ట్రేడులకు -గ్రామీణ ప్రాంతాల్లో రూ. 15,000/-పట్టణాల్లో రూ.16,500/- నాన్ ఇంజినీరింగ్ ట్రేడులకుగ్రామీణ ప్రాంతాల్లో రూ. 12,000/-పట్టణాల్లో రూ. 13,200/- ●సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫీజు: రూ.10/- -ఎంపిక: ఎస్‌ఎస్‌సీ మార్కులు, నియమ నిబంధనల మేరకు మెరిట్ కం రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. 
●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: జూన్ 26
●వెబ్‌సైట్: http://iti.telangana.gov.in