SSC Recruitment 2023 Inter అర్హతతో.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 7547 ఉద్యోగాలు SSC Recruitment 2023 | ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంలో 7547 కానిస్టేబుల్ (Executive) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) ప్రకటన విడుదల చేసింది.
SSC Recruitment 2023:
ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంలో 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పురుషులకు సంబంధించి 5056 పోస్టులు, మహిళలకు సంబంధించి 2491 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ (ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 7547 (పురుషులు 5056 పోస్టులు, మహిళలు 2491 పోస్టులు)
పోస్టులు: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
SSC Recruitment 2023:
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- పే స్కేల్ : రూ.21,700 నుంచి రూ.69,100
- పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్.
- వయస్సు : 18నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
- దరఖాస్తు ఫీజు: రూ.100
- చివరితేదీ: సెప్టెంబర్ 30
- వెబ్‌సైట్: www.sss.nic.in 👈