Telangana TSPSC Group-4 Notification Released Total 9,168 posts

తెలంగాణ TSPSC గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 


ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌ అండ్‌ వార్డ్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలను tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఇటీవల 9,168 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Telangana TSPSC Group-4 Notification Released Total 9,168 posts

ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్‌-4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. గతంలో గ్రూప్-2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మరికొన్ని కేటగిరీలకు సంబంధించిన పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నరు.

CLICK HERE FOR DETAILED PDF NOTIFICATION