తెలంగాణా గ్రూప్‌-4 మరియు గ్రూప్-2 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నది.

తెలంగాణలో ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్‌-2, 4 ఉద్యోగాలు భర్తీ చేసే పనిలో పడింది. పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నది.


ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా TSPSC కి అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రూప్‌-4 పోస్టుల నోటిఫికేషన్‌ విడుదలపై ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి TSPSC చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డితోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రూప్‌-4 క్యాడర్‌ కింద త్వరలో 9,168 పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని సీఎస్‌ సూచించారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికుల కేటాయించినట్ట చెప్పారు. 

తెలంగాణా గ్రూప్‌-4 మరియు గ్రూప్-2 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనున్నది.

గ్రూపు-2లో 582  ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. గ్రూప్‌-2లో మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ), అటవీ శాఖలో ఉద్యోగాలు తొలుత భర్తీ చేయాలని యోచిస్తున్నది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఇచ్చిన కొద్దిరోజుల తర్వాత గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీచేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం వివిధ శాఖల నుంచి నివేదికలు సేకరిస్తున్నది. గ్రూప్‌-4లో కిందిస్థాయి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కాబట్టి జిల్లాలవారీగా నివేదికలు పంపాలని TSPSC ఆదేశించింది.