విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సూచించారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ సన్నద్ధత సహా తదితర అంశాలపై చర్చించారు.
| The Telangana government has announced holidays for educational institutions |
రేపట్నుంచి రాష్ట్రంలో సీరో సర్వే
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మరోసారి సీరో సర్వే చేయనున్నారు. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. రక్తంలో యాంటీబాడీల అభివృద్ధిపై అధ్యయనం కోసం ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల చొప్పున ఎంపిక చేసి సర్వే చేస్తారు. 16వేల మంది నమూనాలతో అధ్యయనం చేస్తారు. వైరస్‌ని ఎదుర్కొనేందుకు జనంలో ఎంత మేరకు నిరోధకత పెరిగిందనే అంశం ఈ సర్వేలో తెలుస్తుంది.