Apply for Voter ID Card online and Offline in Telangana

భారత ఎన్నికల సంఘం  విడుదల చేసిన స్పెషల్ సమ్మరి రివిజన్ - 2022 లో భాగంగా నూతన ఓటరుగా నమోదు చేసుకొనుటకు, ఓటరు జాబితాలో పెర్లు ఉన్నవారు మార్పులు, చేర్పులు  చేసుకొనుటకు అవకాశము కల్పించినారు. 

ఈ నెల 30వ తేది  లోపు అర్జిదారు తమ ధరఖాస్తులులను బూత్ లెవెల్ అధికారి కాని, తహశీల్దారు కార్యలయము లో కాని అందజేయగలరు. Online ద్వారా ధరకాస్తు చేసుకొనువారు క్రింది లింక్ ద్వారా చేసుకోవచ్చును. 

Apply for Voter ID Card online and Offline in Telangana

Click here for New Voter Registration 👈

1. జిల్లాల వ్యాప్తంగా జనవరి 1, 2022  నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు  ఈ నెల 30వ తేది  లోపు నూతన ఓటరుగా నమోదు చేసుకొనుటకు ఫారం 6 ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను.


2. ఒక నియోజకవర్గ ఉన్న ఓటర్లు  వెరొక నియోజకవర్గంనకు మార్పు చేసుకొనుటకు, మీ యొక్క పాత EPIC నెంబరు ద్వారా  ఫారం 6 ధరఖాస్తు చేసుకొనవలెను.


3. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తప్పులు సరి చేసుకొనుట, సవరణ చేసుకొనుటకు ఫారం 8 ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను.


4.  ఒక నియోజకవర్గ ఉన్న ఓటర్లు అదే  నియోజకవర్గం లోని మరొక చిరునామాకు మార్పు చేసుకొనుటకు ఫారం 8A ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను.


5.  ఓటరు జాబితా నుండు పేరు తొలగించుటకు ఫారం 7 ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను. (మరణించినవారు, డబుల్ గా నమొదయినవారు, పూర్తిగా వెళ్ళిపోయు, లేని వారు)

ఓటరు జాబితాపై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను నిర్వహించబడును.

బూత్ లెవెల్ అధికారి  ముసాయిదా ఓటరు జాబితా కాపీలతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఊండి దరఖాస్తులు స్వీకరించును.

Click here for New Voter Registration 👈