టీచర్లు కు నగదు మరియు బియ్యం పథకానికి విద్యాశాఖ మార్గదర్శకాలు

టీచర్లు కు గదు, బియ్యం పథకానికి అర్హతలు

2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్‌ బోర్డుతోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర బోర్డుల నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై మార్గదర్శకాలను విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ చిత్రా రామచంద్రన్‌ శుక్రవారం విడుదలచేశారు.

మార్గదర్శకాలు..

  • విద్యాశాఖ విడుదల చేసిన ప్రొఫార్మా ప్రకారం టీచర్లు, సిబ్బంది ముందుగా తాము పనిచేస్తున్న పాఠశాల హెడ్‌మాస్టర్‌ (హెచ్‌ఎం)కు దరఖాస్తును సమర్పించాలి. ప్రొఫార్మాలోని పార్ట్‌-ఏలో ఉద్యోగి పేరు, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌, ఆధార్‌కార్డు నంబర్‌, వ్యక్తిగత వివరాలు ఉంటాయి. పార్ట్‌-బీలో పాఠశాల వివరాలుంటాయి.
  • సిబ్బంది సమర్పించిన దరఖాస్తులను హెచ్‌ఎం https://schooledu.telangana.gov.in లో అప్‌లోడ్‌ చేసి, ఆయా దరఖాస్తులను ప్రింట్‌ తీసుకోవాలి. ఆ ప్రింట్ల కాపీని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)కు సమర్పించాలి.
  • ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను డీఈవో నేతృత్వంలో ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, జిల్లా కలెక్టర్‌ నియమించిన ఇతర అధికారులు పరిశీలిస్తారు. సక్రమంగా ఉన్న దరఖాస్తులను డీఈవో లాగిన్‌ ఐడీ ద్వారా ఆమోదించి ప్రింట్‌ తీసుకుంటారు.
  • ఇక్కడి నుంచి డాటా మొత్తం జిల్లా కలెక్టర్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి ఆర్థిక, పౌరసరఫరాలశాఖలకు పంపి, నెలకు రూ. 2వేల ఆర్థిక సహాయంతోపాటు, 25 కేజీల బియ్యం అందజేస్తారు. పాఠశాలలు మళ్లీ తెరిచేవరకు ఈ సహాయం కొనసాగుతుంది.
  • సమాచార సేకరణ, పరిశీలన కోసం జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్ల సిబ్బంది, జిల్లా యంత్రాంగం సహాయం తీసుకొంటారు.

పార్ట్‌-ఏలో పూరించేవి (టీచర్‌, సిబ్బంది)
ఉద్యోగి పేరు, జెండర్‌, తండ్రి/ భర్తపేరు, హోదా, బోధన/బోధనేతర సిబ్బంది, ఆధార్‌ నంబర్‌, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, బ్యాంకుఖాతా, ఆధార్‌కార్డులో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌, ఆహార భద్రతా కార్డు వివరాలు, రేషన్‌ షాపు నంబర్‌, గ్రామం/ మున్సిపల్‌ వార్డు, మండలం/ మున్సిపాలిటీ, జిల్లా. ఈ సమాచారమంతా సరైనదేనని స్వీయ ధృవీకరణ.

పార్ట్‌ -బీలో పూరించేవి (పాఠశాల)
పాఠశాల పేరు, గ్రామం/వార్డు, మండలం/ మున్సిపాలిటీ, జిల్లా, గుర్తింపు ఉన్నదా/లేదా, ఉంటే గుర్తింపు నంబర్‌, పాఠశాల వివరాలు (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల), స్టేట్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర బోర్డు గుర్తింపు వివరాలు, ప్రవేశాల సంఖ్య, టీచర్లు, సిబ్బంది సంఖ్య, ప్రధానోపాధ్యాయుడి పేరు, ఫోన్‌ నంబర్‌. ఈ సమాచారమంతా సక్రమమేనంటూ హెచ్‌ఎం స్వీయ ధృవీకరణ.

ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా వెబ్సైట్ చూడండి www.esarkarijob.com 👈