CISF 429 ఖాళీలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న హెడ్‌కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
  • పోస్టు పేరు: హెడ్‌కానిస్టేబుల్ (మినిస్టీరియల్) 
  • మొత్తం ఖాళీలు-429 (జనరల్-222, ఓబీసీ-114, ఎస్సీ-63, ఎస్టీ-30)
  • వీటిలో పురుషులు-328, మహిళలు-37, ఎల్‌డీసీఈ-64 కేటాయించారు.
  • అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
  • వయస్సు: 2019 ఫిబ్రవరి 20 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • పేస్కేల్: లెవల్ 4 ప్రకారం రూ. 25,500-81,100/- ఇతర డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలు ఉంటాయి.
  • శారీరక ప్రమాణాలు: ఎత్తు: ఫురుషులు 167 సెం.మీ., మహిళలు 155 సెం.మీ ఉండాలి.
  • ఛాతీ: పురుషులు-77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి 
  • బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు దామాషాగా ఉండాలి.
  • ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ, స్కిల్ టెస్ట్ ద్వారా
  • రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లిష్/హిందీ అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. 2 గంటల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • రాతపరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషల్లోనే నిర్వహి స్తారు,
  • పరీక్షలో అర్హత మార్కులు- జనరల్ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులను తప్పనిసరిగా సాధించాలి.
  • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను సంబంధిత రీజినల్ ప్రాంతీయ కార్యాలయానికి పంపాలి.
  • చిరునామా: DIG, CISF (South Zone), Rajaji Bhavan, D Block, Besant Nagar, Chennai -600090
  • దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 20
  • వెబ్‌సైట్: https://cisfrectt.in