NVS Recruitment 2022 PGT and TGT Posts Apply Now

కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు చెందిన జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి నియామక ప్రకటన!! దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో.. ప్రిన్సిపల్స్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), మ్యూజిక్, ఇతర విభాగాల్లో.. 1,616 పోస్ట్‌ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది.


  • నోటిఫికేషన్‌ తదితర సమాచారం
  • ప్రిన్సిపల్‌(గ్రూప్‌-ఎ)-12 పోస్ట్‌లు
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(గ్రూప్‌-బి)-397
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(గ్రూప్‌-బి)-683
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌-థర్డ్‌ లాంగ్వేజ్‌(గ్రూప్‌-బి) – 343
  • ఇతర టీచింగ్‌ పోస్ట్‌లు (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ- మేల్, పీఈటీ-ఫిమేల్, లైబ్రేరియన్‌)-181పోస్ట్‌లు.

అర్హతలు తదితర సమాచారం

  • ప్రిన్సిపల్‌: కనీసం యాభై శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. బీఈడీ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఈ పోస్ట్‌కు సంబంధించి పని అనుభవాన్ని కూడా అర్హత ప్రమాణంగా పేర్కొన్నారు. వయసు 50ఏళ్ల లోపు ఉండాలి.

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన నైపుణ్యం, అనుభవం ఉండాలి. వయసు 40ఏళ్ల లోపు ఉండాలి.

  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ): కనీసం 50శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటె డ్‌ బీఈడీ ఉత్తీర్ణత సాధించాలి.లేదా డిగ్రీతోపాటు బీఈడీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.వయసు 35ఏళ్ల లోపు ఉండాలి.

  • ఇతర కేటగిరీ పోస్టులకు గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్లొమా(ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్‌ డిగ్రీ(మ్యూజిక్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 35ఏళ్లలోపు ఉండాలి.
ముఖ్యాంశాలు తదితర సమాచారం…
  • ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, థర్డ్‌ లాంగ్వేజ్‌ టీజీటీ, ఇతర విభాగాల్లో 1,616 టీచర్‌ పోస్ట్‌లు.
  • ఆయా పోస్ట్‌లకు సంబంధించి 150 మార్కులతో రాత పరీక్ష.
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూ.
  • ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే పే లెవల్‌-7,8లతో నియామకం ఖరారు.
  • గరిష్ట వయో పరిమితి విషయంలో రిజర్వ్‌డ్‌ కేటగిరీ వర్గాల వారికి నిబంధనల మేరకు సడలింపు కల్పిస్తారు.
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 22, 2022
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహణ: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
  • వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/