Assam Rifles Recruitment for 1230 Technical and Tradesmen posts Apply Now

అస్సాం రైఫిల్స్‌లో 1230 టెక్నికల్‌, ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1230 పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 25 వరకు అందుబాటులో ఉంటాయి.

మొత్తం పోస్టులు: 1230

ఇందులో తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్‌లో 64 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

●అర్హతలు: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌, డిగ్రీ పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.

● ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా

● దరఖాస్తు విధానం: Online

● దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 25

●  వెబ్‌సైట్‌: assamrifles.gov.in