corona vaccine registration రిజిస్ట‌ర్ చేసుకోండి

vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు క‌రోనా టీకా కోసం ఇలా రిజిస్ట‌ర్ చేసుకోండి

corona vaccine registration : సెకండ్‌వేవ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. వ్యాక్సిన్‌ పొందాలనుకునేవారు CoWIN వెబ్‌పోర్ట‌ల్‌లో త‌ప్ప‌నిసరిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల.  18 ఏళ్లు నిండిన అందరికీ టీకా ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు వచ్చే వాళ్లతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీకా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొవిన్ వెబ్‌సైట్‌లో టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తెలుసుకుందాం..

corona vaccine registration రిజిస్ట‌ర్ చేసుకోండి

కొవిన్ వెబ్‌సైట్‌లో ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలి.vaccine registration 

  • ముందుగా కొవిన్ పోర్ట‌ల్ ( cowin.gov.in ) ఓపెన్ చేయాలి. అనంత‌రం మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంట‌ర్ చేసి, వెరిఫై బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ అని పేజి ఓపెన్ అవుతుంది.
  • అందులో ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్స‌రం వంటి వివ‌రాల‌ను న‌మోదు చేసి రిజిస్ట‌ర్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేష‌న్ అనంత‌రం ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మ‌రో పేజి ఓపెన్ అవుతుంది.
  • అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయ‌గానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా క‌నిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, స‌మ‌యాన్ని సెలెక్ట్ చేసుకుని క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవ‌చ్చు. అలాగే షెడ్యూల్ తేదీల‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది.
  • కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.
  • లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

అయితే ఈసారి ప్రైవేటు సెంటర్ల‌లో వ్యాక్సిన్ తీసుకునే వాళ్లు త‌మ‌కు ఏ వ్యాక్సిన్ కావాలో అదే వేసుకునే అవ‌కాశం క‌ల‌గ‌నుండ‌టం విశేషం. ఇప్ప‌టికే దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రైవేట్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ఎక‌న‌మిక్ టైమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది.


ప్ర‌తి సెంట‌ర్ త‌మ ద‌గ్గ‌ర ఏ వ్యాక్సిన్‌, ఎంత ఉంది, దాని ధ‌ర ఎంత అన్న వివ‌రాలు CoWIN వెబ్‌పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉంచాల‌ని ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ ఎంచుకునే వీలు మాత్ర‌మే ఉండేది. వ్యాక్సిన్ మాత్రం అక్క‌డి ఉన్న‌దే ఇచ్చేవాళ్లు. అయితే ఇక నుంచి మీకు కావాల్సిన వ్యాక్సిన్‌ను కూడా ఎంచుకునే వీలుంటుంది. ప్ర‌స్తుతం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.

For Government Job Notifications Click Here