Application for BC Overseas Student Fund Scheme Telangana 2019

BC ఓవర్సిఎస్ విద్యార్థినిధి పథకానికి దరఖాస్తు స్వీకరణ
Mahatma Jyotibapule BC Overseas Vidyadhi Scheme 2019
●మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా లబ్ధికి అభ్యర్థులు లబ్ది పొందవచ్చు.

●ఆగస్టు 1 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించదలచిన బీసీ విద్యార్థులు ప్రభుత్వం తరఫున  రూ.20 లక్షల ఆర్థిక సహాయాo అందిస్తున్నారు.

●వీసా, పాస్‌పోర్ట్ కాపీతోపాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణపత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. యూకే, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్‌కొరియా దేశాల్లో ఉన్నత విద్యావకాశం పొందినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

●పూర్తి వివరాలకు అభ్యర్థులు http://www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కమిషనర్ తెలిపారు.