ARMY TECHNICAL GRADUATION COURSE

పోస్ట్ పేరు: టెక్నికల్‌గ్రాడ్యుయేట్ కోర్సు
●మొత్తం ఖాళీలు: 40 ఖాళీలు
●సివిల్-10
●మెకానికల్-4
●ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-5
●కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్-6
●ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్-7
●ఎలక్ట్రానిక్స్-2, మెటలర్జికల్-2, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్-2, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-1, ఆర్కిటెక్చర్-1.
●అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు (2019 జూలై 1 లోపు డిగ్రీ పూర్తిచేయాలి) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -వయస్సు: 2019 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి (1992 జూలై 2 నుంచి 1999 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి). -శారీరక ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
●పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి. కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. -ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్ ద్వారా -ఎస్‌ఎస్‌బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ /టెస్ట్‌లను నిర్వహిస్తుంది. -ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదురోజులపాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్)లో నిర్వహిస్తారు.
●దరఖాస్తు: చివరితేదీ: నవంబర్ 28
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in