BRO Recruitment 2019

BRO NOTIFICATION
www.tspscinfo.com
పుణెలోని బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న మల్టీ స్కిల్డ్ వర్కర్ తదితర టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
●పోస్టు పేరు: మల్టీ స్కిల్డ్ వర్కర్

●మొత్తం ఖాళీలు: 778

విభాగాలవారీగా ఖాళీలు:
డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్-388
ఎలక్ట్రీషియన్-101
●వెహికిల్ మెకానిక్-92
●మల్టీ స్కిల్డ్ వర్కర్-197
●సదరన్ రీజియన్‌లోని ప్రాంతాలు: తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరి.
●అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులకు పదోతరగతి, మిగతా కేటగిరి పోస్టులకు పదోతరగతితోపాటు ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ సర్టిఫికెట్ ఉండాలి. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు పదోతరగతి+ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
●వయస్సు: మల్టీ స్కిల్డ్ వర్కర్‌కు 25 ఏండ్లు, మిగతా కేటగిరిలకు 27 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
●పేస్కేల్: మల్టీస్కిల్డ్ వర్కర్ పోస్టులకు లెవల్-1 ప్రకారం రూ. 18,000-39,900/-, మిగతా పోస్టులకు లెవల్-2 ప్రకారం రూ. 19,900-44,400/-
●అప్లికేషన్ ఫీజు: రూ. 50/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు
●ఎంపిక: ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా
●దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
●చిరునామా: Commandant, GREF centre, Dighi camp, Pune - 411015
●దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
●వెబ్‌సైట్: www.bro.gov.in 👈