SBI Junior Associates Recruitment 2019

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్&సేల్స్)
●మొత్తం ఖాళీలు: 8653
●హైదరాబాద్ సర్కిల్ పరిధిలో- 425 
●అర్హతలు: 2019, ఆగస్టు 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నవారు/రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్‌ను ఆగస్టు 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. 
●వయస్సు: 2019, ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1991, ఏప్రిల్ 2 నుంచి 1999, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. -ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
●ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్) ●ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. ●పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 (20 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ-35 (20 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ-35 (20 నిమిషాలు) ప్రశ్నలు ఇస్తారు. -నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోతవిధిస్తారు. 
●ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను జూన్ నెలలో నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్:
●ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ●జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు- 35 నిమిషాలు -జనరల్ ఇంగ్లిష్ -40 ప్రశ్నలు-40 మార్కులు- 35 నిమిషాలు -క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు- 45 నిమిషాలు -రీజనింగ్ ఎబిలిటీ&కంప్యూటర్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-60 మార్కులు- 45 నిమిషాలు. ●మొత్తం 190 ప్రశ్నలు- 200 మార్కులు- 2 గంటల 40 నిమిషాల కాలవ్యవధి. 
●నోట్: ప్రశ్నపత్రం ఇంగ్లిష్/స్థానిక భాషలో ఇస్తారు. -తుది ఎంపిక: మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు. 
●పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ●దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
●చివరితేదీ: మే 3
●వెబ్‌సైట్: https://www.sbi.co.in 👈