Telangana బీసీ గురుకులాలో పోస్టులు

119 తెలంగాణ బీసీ గురుకులాలకు పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3,689 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతులను మంజూరు చేసింది. 1071 టీజీటీ, 833 జేఎల్, 833పీజీటీ, 119 ప్రిన్సిపల్ పోస్టులు, 119 ఫిజికల్ డైరెక్టర్, 119 పీఈటీ పోస్టులు మంజూరు చేశారు. 119 లైబ్రేరియన్, 119 క్రాఫ్ట్, 119 స్టాఫ్ నర్స్ పోస్టులను మంజూరు చేశారు. 119 సీనియర్ అసిస్టెంట్, 119 జూనియర్ అసిస్టెంట్, పొరుగు సేవల విధానంలో మరో 595 పోస్టులు మంజూరు చేశారు. 2019- 2020 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లలో పోస్టుల భర్తీ చేస్తారు.