నవోదయ విద్యాలయ సమితి పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులు

మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా హెడ్‌క్వార్టర్/రీజినల్ ఆఫీస్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ, ప్రిన్సిపాల్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 • మొత్తం పోస్టులు: 251
 • పోస్టులవారీగా అర్హతలు:
 •  ప్రిన్సిపాల్-25- ఏదైనా మాస్టర్ డిగ్రీ 50 శాతం మార్కులతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ లేదా అటానమస్ సంస్థల్లో వైస్‌ప్రిన్సిపాల్ లేదా అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్/లెక్చరర్/పీజీటీగా పనిచేసి ఉండాలి. 
 •  పేస్కేల్: రూ. 78,800-2,09,200/- 
 • అసిస్టెంట్ కమిషనర్-3- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఎనిమిదేండ్ల అనుభవం.
 •  పేస్కేల్: రూ. 67,700-2,08,700/- 
 • అసిస్టెంట్/ కంప్యూటర్ ఆపరేటర్-5 ఖాళీలు- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 
 • పేస్కేల్: రూ. 25,500-81,100/- (అసిస్టెంట్ పోస్టులకు రూ. 35,400/-1,12,400/-) 
 • పీజీటీ-218 (బయాలజీ-16, కెమిస్ట్రీ-25, కామర్స్-21, ఎకనామిక్స్-37, జాగ్రఫీ-25, హిందీ-11, హిస్టరీ-21, మ్యాథ్స్-17, ఫిజిక్స్-34, ఐటీ-11) 
 • అర్హత: సంబంధిత సబెక్టుల్లో మాస్టర్ డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత మెథడాలజీ (సబ్జెక్టు)లో బీఈడీ పూర్తిచేసి ఉండాలి.
 • పే స్కేల్: రూ. 47,600-1,51,100/-
 • వయస్సు: పీజీటీ పోస్టులకు 40, అసిస్టెంట్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 30, అసిస్టెంట్ కమిషనర్‌కు 45, ప్రిన్సిపాల్‌కు 50 ఏండ్లు మించరాదు.
 • దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపాల్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు రూ. 1500/-, పీజీటీ పోస్టులకు రూ.1000/-, మిగతా పోస్టులకు రూ. 800/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
 •  ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ 
 • పోస్టులను బట్టి వేర్వేరుగా రాతపరీక్షలో తేడాలు ఉన్నాయి. రాతపరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 
 • పీజీటీ మొత్తం 180 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మూడు గంటల్లో పూర్తిచేయాలి. దీనిలో జనరల్ ఇంగ్లిష్-20, జనరల్ హిందీ-20, జనరల్ అవేర్‌నెస్-30, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్-30, టీచింగ్ ఆప్టిట్యూడ్-20, సంబంధిత సబ్జెక్టు-60 ప్రశ్నలు ఇస్తారు. 
 • దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 14
 • రాతపరీక్ష తేదీ: మార్చి చివరి వారంలో
 • వెబ్‌సైట్: www.nvsrect2019.org