తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్

●పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను టీఎస్‌ఎల్‌పీఆర్బీ ఖరారు చేసింది. డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లను నిర్వహించనున్నట్టు శనివారం చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్, ఏఎస్సై వివిధ క్యాటగిరీల్లో మొత్తం 3,77,770 మంది ఈవెంట్స్‌కు ఎంపికైనట్టు పేర్కొన్నారు.

●ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ కోసం పార్ట్-2 దరఖాస్తును నింపి, అక్టోబర్ 29 సోమవారం ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 అర్ధరాత్రిలోగా సమర్పించాలని సూచించారు. పీఎంటీ, పీఈటీలు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 17 ప్రారంభమయ్యే ఈవెంట్స్‌ను 35 నుంచి 40 పనిదినాల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించారు.

●పార్ట్-2 దరఖాస్తు నింపడంలో జాగ్రత్త పీఎంటీ, పీఈటీలకు హాజరయ్యే అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తును నింపే సమయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఏయే తేదీల్లో పీఎంటీ, పీఈటీలు ఉన్నవో వెబ్‌సైట్‌లో త్వరలోనే వెల్లడిస్తామని, ఆ రోజు అడ్మిట్‌కార్డు తీసుకురావాలని, బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిపోలితేనే అనుమతిస్తామని చైర్మన్ స్పష్టంచేశారు.

Filling-up Part-II Applications, Uploading Documents from 29th October to 18th November

CLICK HERE https://www.tslprb.in