భారత నావికాదళంలో 10+2 (బీటెక్) ఎంట్రీ స్కీం

●భారత నావికాదళంలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మనెంట్ కమిషన్ ) కింద నాలుగేండ్ల డిగ్రీ కోర్సు లో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఐఎన్‌ఏ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
●కోర్సు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం
●వయస్సు: 2000, జనవరి 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
●విద్యార్హతలు: 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ (ఎస్‌స్‌సీ/ఇంటర్‌స్థాయి)లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
●జేఈఈ మెయిన్ -2018 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ●శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు & ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
●ఎంపిక: జేఈఈ మెయిన్ -2018 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను రెండు దశల్లో నిర్వహిస్తుంది. -స్టేజ్ -1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని స్టేజ్ - 2కు ఎంపిక చేస్తారు. -స్టేజ్ - 2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ (సుమారు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు). -ఆల్ ఇండియా మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.
●పేస్కేల్: సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు రూ.83,448-96,204/-జీతం చెల్లిస్తారు.
●దరఖాస్తు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 3
●దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 22
●వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in